టీటీడీ సంచలన నిర్ణ‌యం..మూడో ఘాట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం

-

తిరుమ‌ల‌లో మూడో ఘాట్ రోడ్డు నిర్మాణానికి టీటీడీ పాలక మండలి నిర్ణ‌యం తీసుకుంది. మూడో ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం అన్నీ ఏర్పాట్లు చేస్తునట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అన్న‌మ‌య్య మార్గం లో భ‌క్తుల రాక‌పోక‌లు జ‌రిగేలా అభివృద్ధి చేస్తామని… అంచ‌నాలు రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించామన్నారు.

శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేస్తామని.. తాళ్లపత్ర కందిరీగలను పరిరక్షించడానికి యస్వీ వేద విద్యాలయంలో మ్యాన్ స్ర్కిప్ట్ విభాగాని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శనభాగ్యాం కల్పిస్తామని.. భక్తులుకు శ్రీవేంకటేశ్వర నామ కోటి పుస్తకాలను అందిస్తామని వెల్లడించారు.

కళ్యాణకట్ట క్షురకులుకు ఇచ్చే పీస్ రేటును 11 నుంచి 15 రూపాయలకు పెంచామని.. 3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో స్విమ్స్ లో భవనాలు నిర్మాణం చేస్తున్నామని.. 12 కోట్ల రూపాయల వ్యయంతో మహిళా యూనివర్సిటీ లో హస్టల్ భవనాలు నిర్మాణం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version