ఇది కాలం పెట్టిన శాపం కాదు.. రాష్ట్రానికి కాంగ్రెస్ పెట్టిన శఠగోపం : కేటీఆర్

-

కాంగ్రెస్ అంటే కరువు కరువు అంటే కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఆ పార్టీపై మండిపడ్డారు. కక్షతో కాళేశ్వరం పంపులను పడావుపెట్టి, నిర్లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పక్కనపెట్టి, గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరదలు వచ్చినా నీటిని ఒడిసిపట్టుకోకుండా వదిలేసిన ఫలితం సాగునీళ్లు లేక ఎండిన పొలాలు అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తాగునీళ్లు లేక తడారుతున్న గొంతులు. పక్కన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమి లేకపాయె అని వాపోయారు.

“తలాపునా పారుతుంది గోదారి మన సేను, మన సెలుక ఎడారి నాడు కేసీఆర్ గారి పాలనలో జలకళ నేడు అసమర్థ కాంగ్రెస్ పాలనలో విలవిల నాడు ఇంటింటికి నల్లానీళ్లు నేడు ఆడబిడ్డల కండ్లల్లో కన్నీళ్లు ఇది శ్రీశైలం, సాగర్ జలాశయాలను ఏపీ సర్కారు ఖాళీ చేస్తున్నా నోరెత్తని కాంగ్రెస్ సర్కారు తప్పిదం ఇది కాళేశ్వరం నుండి నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కేసీఆర్ గారి మీద కక్షతో రిజర్వాయర్లను, చెరువులు, కుంటలు నింపని కాంగ్రెస్ పాపం. ఇది కాలం పెట్టిన శాపం కాదు ఇది తెలంగాణకు కాంగ్రెస్ పెట్టిన శఠగోపం” అంటూ హస్తం పార్టీపై కేటీఆర్ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news