వరలక్ష్మి శరత్ కుమార్ విశాల్ కి బ్రేకప్ చెప్పేసిన తర్వాత సింగిల్ గా ఉండిపోయింది కొన్ని రోజులు ఆమె సింగిల్ గా ఉండిపోయింది అని బాధపడ్డారు ఫ్యాన్స్. రీసెంట్ గా తనకి నచ్చిన అతనితో ఎంగేజ్మెంట్ చేసుకుని అదిరిపోయే న్యూస్ చెప్పింది. దీంతో ఫ్యాన్స్ కూడా సంతోషపడ్డారు ఇంకా పెళ్లి అవ్వకుండానే వరలక్ష్మి శరత్ కుమార్ తన ఫియాన్సీ తో కలిసి ట్రిప్స్ వేసి ఎంజాయ్ చేస్తోంది.
ఇప్పుడు బ్యాంకాక్ లో గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. షాపింగ్, వర్క్ అవుట్స్, లంచ్, డిన్నర్ ఇలా అన్ని పిక్స్ ని కూడా పంచుకుంటున్నారు. అభిమానులు హ్యాపీ ఫర్ యు వరలక్ష్మి అని అంటున్నారు. కొంతమంది మాత్రం తిట్టిపోస్తున్నారు. ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది పెళ్లి కాదని వరలక్ష్మిని అంటున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా చేతిలో డజను సినిమాలకు పైగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ రీసెంట్గా హనుమాన్ లో అక్క పాత్రలో నటించి అందరిని మెప్పించింది.