ఏపీలో కొత్త ప్రభుత్వం రాబోతుందన్నారు నారా భువనేశ్వరి. నంద్యాలలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ… పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. నంద్యాలలోని వి.సి.కాలనీ , టెక్కీ ప్రాంతాల్లో నారా భువనేశ్వరి పర్యటించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టు వల్ల మృతి చెందిన కుటుంబ సభ్యులకు భువనేశ్వరి పరామర్శించారు. టిడిపి బిజెపి జనసేన జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనని ఈ సందర్భంగా తెలిపారు నారా భువ నేశ్వరి. పొత్తులను గుర్తుపెట్టుకుని మిగతా పార్టీల వారికి కూడా ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. త్వరలో ప్రజా ప్రభుత్వం రానున్నదన్నారు భువనేశ్వరి.