కేసీఆర్‌కు కమ్యూనిస్టుల డిమాండ్..ఆ సీట్లే టార్గెట్!

-

మూడోసారి కూడా అధికారంలోకి రావాలని చెప్పి కేసీఆర్..ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. ఈ సారి కూడా అధికారంలోకి వచ్చి తెలంగాణలో తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి తెలంగాణలో అధికారం దక్కించుకోవడం అంత ఈజీ కాదు. అందుకే కే‌సి‌ఆర్ ఆచి తూచి అడుగులేస్తున్నారు.

ఓ వైపు కాంగ్రెస్ పార్టీని అణగదొక్కారు..ఇటు బి‌జే‌పిని టార్గెట్ చేశారు. అంటే ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయేలా చేసి..ఎన్నికల్లో లబ్ది పొందాలనేది కే‌సి‌ఆర్ కాన్సెప్ట్..ఇదే క్రమంలో రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో బలంగా ఉన్న కమ్యూనిస్టులతో పొత్తు దిశగా వెళుతున్నారు. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టుల మద్ధతు తీసుకున్న విషయం తెలిసిందే. మునుగోడులో సి‌పి‌ఐ, సి‌పి‌ఎం పార్టీలకు కొంత బలం ఉంది. ఆ బలమే ఉపఎన్నికలో ఉపయోగపడింది. బి‌ఆర్‌ఎస్ పార్టీ 10 వేల ఓట్ల మెజారిటీతో గెలవడానికి కమ్యూనిస్టులు సపోర్ట్ కీలకమైందని చెప్పవచ్చు. అందుకే కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగించాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు.

ఎలాగో జాతీయ రాజకీయాల్లో మోదీ సర్కార్ తో ఫైట్ చేస్తున్నారు..ఈ క్రమంలో కమ్యూనిస్టుల సపోర్ట్ తీసుకున్నారు. ఇక తెలంగాణలో కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలు సీట్ల విషయంలో గట్టిగా డిమాండ్ చేసేలా ఉన్నాయి. కనీసం చెరో ఐదు సీట్లు అడగాలని చూస్తున్నట్లు తెలిసింది.

కానీ కే‌సి‌ఆర్ చెరో ఐదు సీట్లు ఇవ్వడం కష్టమని చెప్పవచ్చు. ఎందుకంటే సింగిల్ గా పోటీ చేస్తే సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలకు ఒక్క సీటు గెలుచుకునే బలం కబడటం లేదు కాబట్టి ఆ రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే భద్రాచలం, కొత్తగూడెం, హుస్నాబాద్ లతో పాటు గిరిజనులు ఎక్కువగా ఉన్న సీట్లపై ఫోకస్ పెట్టారు. మరి కే‌సి‌ఆర్..కమ్యూనిస్టులకు ఏ సీట్లు ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version