ఒకప్పుడు కంప్యూటర్ ఉత్పత్తులను తయారు చేసి పాపులర్ అయిన కాంపాక్యు సంస్థ భారత టీవీ మార్కెట్‌లో తాజాగా రంగ ప్రవేశం చేసింది. అందులో భాగంగానే ఈ కంపెనీ మంగళవారం కొత్త టీవీలను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. భారత్‌కు చెందిన ఓస్సిఫై ఇండస్ట్రీస్ అనే ఓ స్టార్టప్ కాంపాక్యూను కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే కాంపాక్యు బ్రాండ్ పేరిట ఓస్సిఫై తాజాగా భారత్‌లో నూతన 4కె ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది.
కాంపాక్యు స్మార్ట్ టీవీ సిరీస్‌లో 55, 65 ఇంచుల 4కె క్యూలెడ్ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలు విడుదలయ్యాయి. చాలా సన్నని డిజైన్‌ను ఇవి కలిగి ఉన్నాయి. ఆల్ మెటల్ బాడీని ఇచ్చారు. ఈ టీవీల్లో కాంపాక్యుకు చెందిన ఎక్స్‌పీరియెన్స్ స్టెబిలైజేషన్ ఇంజిన్‌ను అమర్చారు. అందువల్ల పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. రెండు టీవీల డిస్‌ప్లేలు 60 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి. వీటిల్లో 64 బిట్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌లను ఏర్పాటు చేశారు. 24 వాట్ల బాటమ్ ఫైరింగ్ బాక్స్ స్పీకర్లు వీటికి ఉన్నాయి.
ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫాం ఆధారంగా ఈ టీవీలు పనిచేస్తాయి కనుక గూగుల్ ప్లే స్టోర్‌కు సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5 తదితర యాప్స్ ఇన్‌బిల్ట్‌గా వస్తాయి. వైఫై, బ్లూటూత్, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ, 3.5 ఎంఎం జాక్ కనెక్టివిటీ ఆప్షన్లను ఇచ్చారు. ఇన్‌బిల్ట్ గూగుల్ క్రోమ్ క్యాస్ట్, గూగుల్ అసిస్టెంట్ కు సపోర్ట్ ఫీచర్లు వీటిలో ఉన్నాయి.
55 ఇంచుల కాంపాక్యు 4కె క్యూలెడ్ స్మార్ట్ టీవీ ధర రూ.59,999 గా ఉంది. 65 ఇంచుల టీవీ ధర రూ.89,999గా ఉంది. వీటిని ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తున్నారు. త్వరలోనే 32, 40, 43, 50, 55 ఇంచుల సైజుల్లో మరిన్ని మోడల్స్ ను విడుదల చేయనున్నారు. అవి రూ.12,499 ఆరంభ ధర నుంచి లభ్యమవుతాయి.