తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐటెం సాంగ్ వస్తుందంటే చాలు.. ఆడియన్స్ ఈలలు, అరుపులతో థియేటర్స్ దద్దరిల్లిపోతుంటాయి. వెండితెరపైన స్పెషల్ సాంగ్స్ చూసి జనాలు అలా హ్యాపీగా గడిపేస్తుంటారు. ఇకపోతే ఈ ప్రత్యేక గీతాలు చేసేందుకు ప్రత్యేక నటీమణులూ ఉన్నారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.
హీరోయిన్సే స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తు్న్నారు. అలా సినిమాలో హీరోయిన్ తో పాటు స్పెషల్ సాంగ్ చేసిన భామలూ హైలైట్ అవుతున్నారు. ఇటీవల పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో సమంత తొలిసారి స్పెషల్ సాంగ్ చేసింది. ‘ఊ అంటావా మావా’ అంటూ సాగే పాటలో తన అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్న సమంత..సినిమా సక్సెస్ కు సాయపడింది.
అలా జనాలను థియేటర్స్ కు రప్పించడంలో సమంత తన వంతు పాత్ర పోషించిందని చెప్పొచ్చు. అలా స్టార్ హీరోయిన్స్ ప్రజెంట్ స్పెషల్ సాంగ్ చేయడం ఓ ట్రెండయిపోయింది. ఈ క్రమంలోనే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వరుణ్ తేజ్ ‘గని’ చిత్రంలో ‘కొడితే’ అనే స్పెషల్ సాంగ్ చేసింది. జనరల్ గానే తమన్నా అంటే అందం, అభినయం ఉన్న నటిగా గుర్తింపు ఉంది.
ఇక డ్యాన్స్ అయితే ఈ సుందరి ఇరగదీస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఇన్నీ అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ ‘గని’ చిత్రంలో ఈ భామ చేసిన ‘కొడితే’ సాంగ్ సరిగా రాలేదని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తు్న్నారు. థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి ఊహించిన స్థాయిలో స్పందన రావడం లేదు.
కొరియోగ్రఫీ కూడా అంతంత మాత్రంగానే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా స్పెషల్ సాంగ్ చేయడంలో సమంత ముందర తమన్నా నిలబడలేకపోయిందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రంలో రెజీనా కసాండ్ర ‘చానా కష్టం వచ్చిందే మందాకిని’ అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ సినిమాకు ఏ మేరకు అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి మరి..