దంచి కొట్టిన ఢిల్లీ బ్యాటర్లు…. కోల్ కతా నైట్ రైడర్స్ ముందు భారీ టార్గెట్

-

ముంబై బ్రెబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో భారీ స్కోర్ నమోదైంది. ముందుగా టాస్ గెలిచి డీసీని బ్యాటింగ్కు ఆహ్వానించింది కోల్ కతా. ఢిల్లీ బ్యాటర్లు కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ఓపెనర్లుగా వచ్చిన పృథ్వీ షా, డేవిడ్ వార్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. నువ్వా నేనా అన్నట్లుగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరికి తోడు రిషభ్ పంత్, శార్థూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ చెలరేగి ఆడటంతో కోల్ కతా నైట్ రైడర్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికేట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ ముందు 216 లక్ష్యాన్ని ఉంచింది. 

ఢిల్లీ బ్యాటర్లలో పృథ్వీ షా కేవలం 29 బాల్స్ లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 45 బాల్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేశారు. త్వరగానే జౌట్ అయిన రిషభ్ పంత్ ఉన్నంత సేపు జోరు చూపాడు. 14 బాల్స్ లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. ముఖ్యంగా శార్థూల్ ఠాకూర్ ఇన్నింగ్స్ చివర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఉమేష్ కుమార్ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు బాదాడు. 11 బాల్స్ లో 1 ఫోర్, 3 సిక్సులతో 29 రన్స్ చేశాడు. కేకేఆర్ బౌలర్లతో ఉమేష్ యాదవ్, పాట్ కమిన్స్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version