న‌గరి నుంచి పోటీ చేస్తా.. న‌టి వాణీ విశ్వ‌నాథ్ ప్ర‌క‌ట‌న

-

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్యెల్యేగా పోటీ చేయ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని సినీ న‌టి వాణీ విశ్వ‌నాథ్ ప్ర‌క‌టించారు. త‌న అభిమానులు, మ‌హిళ‌ల కోరికా మేర‌కు తాను న‌గరి నియోజ‌క వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో ఇప్పుడే చెప్ప‌లేనని అన్నారు. అప్ప‌టి ప‌రిస్థితులకు అనుగూణంగా ఏ పార్టీ అని ముందుగానే చెబుతాన‌ని అన్నారు. అవ‌స‌రం అయితే.. ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

న‌గరి నుంచి పోటీ మాత్రం ఖాయం అని స్ప‌ష్టం చేశారు. న‌గ‌రి నియోజ‌క వ‌ర్గంలో త‌న అభిమానులు చాలా మంది ఉన్నార‌ని అన్నారు. అలాగే న‌గరిలో త‌న‌కు మ‌హిళ‌ల మ‌ద్ద‌తు కూడా ఎక్కువ‌గా ఉంద‌ని తెలిపారు. కాగ బుధ‌వారం న‌గరిలోని శామాల‌మ్మ ఆల‌యానికి సినీ న‌టి వాణీ విశ్వ‌నాథ్ వ‌చ్చారు. ఆలయంలో మొక్కులు తీర్చుకుని, ప్ర‌త్యేక పూజాలు చేశారు.

న‌గ‌రిలో పోటీ చేయ‌డానికి అమ్మ వారి అశీస్సుల కోసం వ‌చ్చాన‌ని అన్నారు. ఇక మీద‌ట వ‌స్తునే ఉంటాన‌ని అన్నారు. కాగ న‌గ‌రిలో త‌న అమ్మ‌మ్మ న‌ర్సుగా ప‌ని చేసింద‌ని.. ఆమె అందిరికి తెలుస‌ని తెలిపారు. న‌గ‌రిలో త‌మిళ సంప్ర‌దాయం కూడా ఉంటుంద‌ని అన్నారు. అందుకే ప్ర‌జా సేవ చేయ‌డ‌నాకి న‌గ‌రిని ఎంచుకున్న‌ట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version