ప్రకాశం జిల్లా కలెక్టర్ తీరుపై ప్రజలు మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళారు. దళిత సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పై మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఫిర్యాదు చేసారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తే తమను చాంబర్ లోపలకు కూడా రానివ్వటం లేదని మంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళారు. జాయింట్ కలెక్టర్ చేతన్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదుకు కుల ద్రువీకరణ పత్రాలు అడుగుతున్నారని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేసారు.
దేశంలో ఇలాంటి పరిస్దితి ఎక్కడా లేదని మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళారు ఆయా దళిత సంఘాల నేతలు. తమ సమస్యల పరిష్కరానికి ప్రత్యేక కలెక్టర్ నియమించాలని మంత్రి సురేష్ కు విజ్ఙప్తి చేసారు. వారి సమస్య విన్న మంత్రి వెంటనే కలెక్టర్ కి ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది.