మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేసుకోండి.. లేదా భారీ నష్టం తప్పదు..!

-

న్యూఢిల్లీ: ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. గతేడాది కరోనా సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిబంధనలకు గడువు పెంచిన విషయం తెలిసిందే. ఇందులో పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి పెట్టుబడి గడువు, పన్ను మినహాయింపులకు గడువు ఇచ్చింది. అయితే 2021 మార్చి 31వ తేదీతో గడువు ముగుస్తోంది. అయితే పెండింగ్ పన్నులు ఏమైనా ఉంటే తొందరగా కట్టేయాలని, లేదా పన్ను చెల్లింపుదారులు భారీ నష్టాన్ని చవిచూస్తారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

మనీ
మనీ

పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్..
పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు గడువు ఇచ్చింది. ఇది చివరిగా 2020 జూన్ 30 నుంచి 2021 మార్చి 31 వరకు పొడిగించింది. మార్చి 31వ తేదీ వరకు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే.. మీ పాన్ కార్డు నంబర్ పని చేయదని కేంద్రం పేర్కొంది. పాన్ కార్డు పని చేయకపోతే పెద్దమొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరగడం కుదరదని, తప్పనిసరిగా పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయాలని పేర్కొంది.

ఐటీఆర్ ఆదాయపు పన్ను చెల్లించకపోతే..
2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఆదాయపు పన్ను రిటర్న్‌ను చెల్లించకపోతే భారీ ఖర్చును మోయాల్సి వస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగ్గస్తోందని, తొందరగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను చెల్లించాలని కేంద్రం తెలుపుతోంది. ఒకవేళ పన్ను చెల్లించడం ఆలస్యమైతే రూ.10 వేల వరకు ఆలస్య రుసుం చెల్లించాలని, రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు రూ.1000 వరకు ఆలస్య రుసుం చెల్లించాలన్నారు. పాత పద్దతి ప్రకారం పన్ను చెల్లించేవారు డిక్లరేషన్ ప్రకారం పెట్టుబడి పెట్టకపోతే.. పన్ను భారాన్ని తగ్గించలేరన్నారు.

ఎల్‌టీసీ క్యాష్ వోచర్ పథకం..
ఎల్‌టీసీ క్యాష్ వోచర్ పథకం కింద బిల్లులు సమర్పించడం, పన్ను పొందటానికి మార్చి 31వ తేదీ లోపు బిల్లులను సరైన ఫార్మాట్‌లో చెల్లించడం తప్పనిసరి. జీఎస్టీ మొత్తం, వోచర్ నంబర్ కలిగి ఉండాలి. కాగా, ఈ పథకాన్ని 2020 అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం లక్ష్యం డిమాండ్ పెరుగుదలను ఉత్తేజపరచడం, ఎల్‌టీఏ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది.

స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్..
ప్రభుత్వ ఉద్యోగులు 2021 మార్చి 31 వరకు రూ. 10 వేల వరకు ప్రత్యేక అడ్వాన్స్ పొందవచ్చు. ఎల్‌టీసీ క్యాష్ వోచర్ పథకంతోపాటు 2020 అక్టోబర్‌లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ అడ్వాన్స్ తీసుకుంటే, 10 వాయిదాలలో డబ్బులను తిరిగి చెల్లించవచ్చు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అత్యవసర క్రెడిట్ లైన్ పథకాన్ని ప్రకటించింది. కోవిడ్ కష్టకాలంలో వ్యాపారులకు ప్రభుత్వం హామీ లేకుండా రుణాలు ఇచ్చింది. ఈ రుణాలు తీసుకున్న వారు కూడా ఈ నెల చివరి వరకు పన్ను చెల్లించాలి. కాన్ఫిడెన్స్ బై కాన్ఫిడెన్స్ స్కీమ్ కింద డిక్లరేషన్ దాఖలు చేయడానికి గడువును 20 మార్చి 2021కు పొడిగించింది.

Read more RELATED
Recommended to you

Latest news