చిన్నవాటిని చూస్తూ పెద్ద జీవితాన్ని పాడుచేసుకోవద్దని చెప్పే అద్భుతమైన కథ.

-

కళాశాల క్లాస్ రూమ్ లోకి లెక్చరర్ ఎంటర్ అయ్యాడు. అప్పటి వరకూ గది పేలిపోయేలా అరుస్తున్న విద్యార్థులు ఒక్కసారి గా కామ్ అయిపోయారు. సడెన్ గా వచ్చిన లెక్చరర్ వంక చూస్తున్న విద్యార్థులు కొంత షాక్ కి గురయ్యారు. ఆ షాక్ ని మరింత పెంచడానికా అన్నట్టు ఇప్పుడు ఎగ్జామ్ ఉంది రెడీగా ఉండడని చెప్పి, తన చేతిలో ఎగ్జామ్ పేపర్లని అందించాడు. చెప్పకుండా ఎగ్జామ్ అంటున్న లెక్చరర్ వంక అదోలా చూసిన విద్యార్థులు ఆ పేపర్లని చూసి ఖంగుతిన్నారు.

అవన్నీ తెల్ల పేపర్లు. వాటిల్లో మధ్యలో ఒక చిన్న చుక్క మాత్రమే ఉంది. ఇలా చుక్కలున్న పేపర్లని ఎందుకిచ్చాడో అర్థం కాకుండా చూస్తుంటే, లెక్చరర్ కల్పించుకుని, ఈ రోజు మీరు దాని గురించే ఎగ్జామ్ రాయాలన్నాడు. దాంతో అందరూతమకి తోచిన జవాబుని రాసారు. అంతా అయ్యాక ఎగ్జామ్ పేపర్లు తీసుకున్న లెక్చరర్, ఒక్కొక్కదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. దాదాపుగా ప్రతీ ఒక్కరూ ఆ నల్లని చుక్క గురించే రాసారు. అప్పుడు లెక్చరర్ ఈ విధంగా అన్నాడు.

మీరందరూ తెల్లటి పేపర్లో ఉన్న చిన్న చుక్క గురించే రాసారు తప్ప దాని చుట్టుపక్కల ఉన్న తెల్లటి ప్రదేశాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. నల్లచుక్క చాలా చిన్నది. దాని గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదు కూడా. మన జీవితంలోనూ ఆరోగ్య సమస్యలు, బంధాల్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు మొదలైనవన్నీ ఆ చిన్న చుక్కల్లాంటివే. మనమంతా వాటి గురించే ఆలోచిస్తూ అంతకంటే పెద్దదైన జీవితాన్ని ఆనందంగా గడపలేకపోతున్నాం. మీ జీవితంలో ఆరోగ్య సమస్యలు కానీ, ఇంకా ఇతర ఎలాంటి ఇబ్బందులైనా చాలా చిన్నవే. వాటిని పట్టించుకోకుండా ఉంటేనే జీవితంలో హ్యాపీగా ఉంటారు అని చెప్పాడు.

జీవితంలో వచ్చే ఏ కష్టమైనా నల్లచుక్క వంటిదే అని గుర్తించి, అందమైన జీవితాన్ని మిస్ చేసుకోవద్దు. డేర్ టు డూ మోటివేషన్ ఆధారంగా.

Read more RELATED
Recommended to you

Exit mobile version