Congress:ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల…. జగన్ ప్రభుత్వం పై డైరెక్ట్ అటాక్

-

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల ఆదివారం విజయవాడ కానూరులోని కల్యాణ మండపంలో   పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇచ్చిన నియామకపత్రాన్ని  మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, రఘువీరా వైఎస్ షర్మిలకు అందించారు. అధికార వైసీపీ ప్రభుత్వం, తెలుగు దేశం పార్టీ గత పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయినప్పుడు ఏపీకి లక్ష కోట్లు అప్పు ఉండగా చంద్రబాబు పాలనలో రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు అయ్యాయని ఆమె ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక మరో ఆరున్నర లక్షల అప్పులు అయి మొత్తం 10 లక్షలకు పైగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. అప్పులు చేసినప్పటికీ కూడా రాష్ట్రం అభివృద్ధిని నోచుకోలేదని ఆమె ధ్వజమెత్తారు. జగన్ ,చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయక కేవలం దాచుకోవడం, దోచుకోవడం లాంటివి మాత్రమే చేశారని తీవ్రంగా మండిపడ్డారు . రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.

 

10 సంవత్సరాలలో రాష్ట్రానికి ఒక్క భారీ పరిశ్రమ రాలేదని విమర్శించారు. రాష్ట్రానికి మెట్రో ట్రైన్ ఏమో గాని కనీసం రోడ్లు వేసింది లేదని దుయ్యబట్టారు. టిడిపి ,వైసిపి ప్రభుత్వాలు ప్రత్యేక హోదా సాధించడంలో విఫలం చెందారని అన్నారు. ఎక్కడా చూసిన ఇసుక, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియానేనని తెలిపారు.  ప్రతిపక్షనాయకుడుగా వైఎస్‌జగన్‌ ఉన్న సమయంలో స్పెషల్‌ స్టెటస్ కోసం దీక్షలు చేశారు.కానీ సీఎం అయినా తరువాత ఒక్కసారైనా జగన్‌ నిజమైనా ఉద్యమం చేయలేదని విమర్శించారు. రాష్ట్రం నుంచి 22 మంది వైసీపీ, ముగ్గురు టీడీపీ ఎంపీలు, 6 గురు రాజ్యసభ ఎంపీలున్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదాని తీసుకురావడంలో విఫలం చెంది , బీజేపీకి తొత్తులుగా మారారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news