సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. కాంగ్రెస్ నేత అరెస్ట్.. ?

-

ఏదైనా విషయం గురించి సోషల్ మీడియాలో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి అభిప్రాయాలు వెల్లడించాలి.. ఒకవేళ జరిగిన సంఘటనపట్ల అవగహన లేకుంటే నిశబ్ధంగా ఉండాలి.. లేదంటే ఏదో పెద్దరికానికి పోతే ఉన్న పంచే ఊడినట్లుగా పరిస్దితి మారుతుంది.. ఇలాగే ఓ కాంగ్రెస్ నాయకుడు మన దేశానికి సంబంధించిన సంఘటన విషయంలో అతిగా స్పందించి సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడట.. మరి ఇలా చేస్తే పోలీసులు ఊరుకుంటారా ఆ కాంగ్రెస్‌ నాయకుడిని అరెస్టు చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు చూస్తే..

హిమాచల్‌ ప్రదేశ్ పార్లమెంటరీ మాజీ చీఫ్‌ సెక్రటరీ,‌ కాంగ్రెస్‌ నాయకుడు, అయినా నీరజ్‌ భారతి ఇటీవల జరిగిన గల్వాన్‌ ఘటనపై స్పందిస్తూ, సోషల్‌ మీడియా వేదికగా, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని తీవ్రంగా విమర్శించారు. కాగా అతని వ్యాఖ్యలపై సిమ్లాకు చెందిన న్యాయవాది నరేంద్ర గులేరియా స్పందించి రాజద్రోహానికి పాల్పడటం, అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ దేశ ప్రజల మధ్య విద్వేశాన్ని రెచ్చగొట్టడం వంటి చర్యలకు నీరజ్‌ పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నీరజ్‌ భారతిని నిన్న అరెస్టు చేశారు. కాగా నేడు ఆయనను కోర్టులో హాజరు పర్చనున్నారు. చూశారుగా నోటికి, చేతికి దురద ఉంటే కాస్త కంట్రోల్ చేసుకోవాలి అంతేగానీ చేతిలో ఫోను, అందులో సోషల్ మీడియా ఉందిగా అని ఏదిపడితే అది వాగితే పరిస్దితులు ఇలాగే ఉంటాయి అని అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news