ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో 11 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.
దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 157కి పెరిగింది. తాజాగా 24,458 శాంపిల్స్ పరీక్షించగా 796 మందికి పాజిటివ్ అని తేలింది. వారిలో 51 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా, మరో ఐదుగురు ఇటీవలే విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. కొత్త కేసులతో కలిపి ఏపీలో 12,285 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 5,480 మంది డిశ్చార్జి కాగా, 6,648 మంది చికిత్స పొందుతున్నారు.