హైదరాబాద్‌లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ (60) కన్నుమూశారు. కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్ గౌడ్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1959, జూలై 1న ఆయన హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి నరసింహగౌడ్. ముఖ్‌ష్‌గౌడ్‌కు ఇద్దరు కుమారులు, ఒక బిడ్డ ఉన్నారు. ఈయనకు తూళ్ల దేవందర్‌గౌడ్ మేనమామ.
ముఖేష్ గౌడ్ మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. 30 ఏండ్ల నుంచి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖేష్ గౌడ్.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. 2009లో గెలిచిన తర్వాత వైఎస్ కేబినెట్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు.
ముఖేష్ గౌడ్ గత ఏడు నెలల నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆయనకు డాక్టర్లు పలు సర్జరీలు నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన అంబులెన్స్ లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. అయితే గత వారం రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. ఆస్పత్రికి తరలించారు.
– కేశవ