ప్రస్తుతం ప్రభుత్వంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ జోక్యంపై చాలా వరకు విమర్శలు వస్తూ ఉన్నాయి. అనవసర్ జోక్యం సంఘ్ నుంచి వస్తోంది అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత శ్రీవాస్తవ ఒకరు కీలక వ్యాఖ్యలు చేసారు ట్విట్టర్ లో. భారత రాజ్యాంగం రాసినప్పుడు ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉంది? అని ఆయన ప్రశ్నించారు. మన ప్రజాస్వామ్య పునాదులు వేస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉంది? అని ఆయన నిలదీశారు.
దండి మార్చి జరిగిన సమయంలో ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్… సహాయ నిరాకరణ ఉద్యమాన్ని బ్రిటిష్ వారికి సహకారంగా ఎందుకు మార్చింది? అని ప్రశ్నిస్తూ… భోగాస్ భక్తులు అనే హ్యాష్ ట్యాగ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆయన నుంచి వచ్చిన ఈ ట్వీట్ కి మంచి స్పందన వస్తుంది. ఇతర కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కూడా రీట్వీట్ చేస్తున్నారు.