సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకుల కుమ్ములాట మరోసారి బయటపడింది. సిరిసిల్ల జిల్లాలో ఓడిపోయిన వారికే మళ్లీ టికెట్ ఇస్తున్నారంటూ కేకే మహేందర్ రెడ్డిని ఉద్దేశించి పీసీసీ మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో కేకే మహేందర్ వర్గం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే స్టేజీ మీదకు కేకే మహేందర్ రెడ్డి వర్గం దూసుకొచ్చింది. ఉమేష్ రావు సమావేశం నుండి వెళ్లిపోవాలంటూ కేకే మహేందర్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలను సముదాయించి స్టేజీపై నుండి పోలీసులు పంపించివేశారు. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకుల కుమ్ములాట
సిరిసిల్ల టికెట్ ఓడిపోయిన వారికే ఇస్తున్నారంటూ కేకే మహేందర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన పీసీసీ మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు
స్టేజి మీదకు దూసుకు వచ్చిన కేకే మహేందర్ రెడ్డి వర్గం
ఉమేష్ రావు సమావేశం నుండి వెళ్లిపోవాలంటూ ఆందోళనకు… pic.twitter.com/jFr1bcbRXJ
— Telugu Scribe (@TeluguScribe) April 29, 2025