తెలంగాణ లో పదోతరగతి పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఇంటర్మీడియట్.. పదోతరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇక తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు విడుదలవుతాయని ఆసక్తి ఉండటంతో తాజాగా పదోతరగతి బోర్డు అధికారులు క్లారిటీ ఇచ్చారు.
పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశామని.. ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయమంటే అప్పుడు విడుదల చేస్తామని తెలిపారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి.