పనికిమాలిన దేశాలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి పై ఆమె స్పందించారు. పహల్గామ్ సంఘటన దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసిందని.. ఈ ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే పనికిమాలిన దేశాలు చేసే హేయమైన చర్యలకు సమాధానం చెప్పాల్సిన సమయం ఇది అని సంచలన వ్యాఖ్యలు చేసారు.
ప్రతీ భారతీయుడు నడుం కట్టి.. దేశ రక్షణ కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాదు.. నిన్న ఒక మాజీ సైనికుడు దేవం పిలిస్తే.. మేము రెక్కలు కట్టుకొని వచ్చి ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం అని చెప్పారని తెలిపారు. ఇలాంటి యోదులకు మనమంతా అండగా ఉండి.. పోరాడాలని సూచించారు. దేశ భద్రత కోసం ప్రతీ ఒక్కరూ ఒక సైనికుడిగా నిలబడాలన్నారు.