పీసీసీ కోసం హీటెక్కిన రాజకీయం.. హస్తినకు చేరుతున్న నేతలు !

-

పీసీసీ పీఠం కోసం రాజకీయం హీటెక్కింది. హస్తం నేతలు అందరూ హస్తిన బాట పడుతున్నారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ కి వెళ్లిన ఎంపీ రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు ఢిఫెన్స్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొనున్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు జరుగుతున్న వేళ రేవంత్ ఢిల్లీ పర్యటన పై ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ లోపు వెంకట్ రెడ్డి రాహుల్ ను కలవనున్నారు.  సోనియాకు లాయాలిస్ట్ ల పేరిట పలువురు కాంగ్రెస్ నేతల లేఖ రాసి రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఈ నెల12న లేఖ రాయగా అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version