Kadapa: మంత్రి పక్కన కుర్చీ వేయలేదని అలిగి వెళ్లిపోయిన మాధవి రెడ్డి !

-

కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి మళ్లీ అలిగారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పక్కన కుర్చీ వేయలేదని అలిగి వెళ్లిపోయారు మాధవి రెడ్డి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వివాదాస్పదంగా కడప ఎమ్మెల్యే తీరు మారింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా జేసీ అతిధి సింగ్ పై ఎమ్మెల్యే మాధవి రెడ్డి చిందులు వేశారు.

Madhavi Reddy leaves after being told not to put a chair next to the minister
Madhavi Reddy leaves after being told not to put a chair next to the minister

జేసీని గుడ్లు ఉరిమి చూసారు కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి. స్టేజ్ పైకి ఆహ్వానించకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. స్టేజ్ పైకి రావాలని ఎమ్మెల్యేని కోరారు జిల్లా కలెక్టర్. తిరస్కరించడంతో అక్కడికి వెళ్లి కూర్చోమని చెప్పారు కలెక్టర్. అరగంట పైగా నిల్చొని ఆ తర్వాత వెనుదిరిగారు కడప ఎమ్మెల్యే. స్టేజీపై ముఖ్య అతిధి మంత్రి ఫరూక్, పాటు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అతిధి సింగ్ కూర్చున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలకు స్టేజ్ పై అనుమతి లేదు.. కానీ కుర్చీ వెయ్యనందుకు ఫైర్అయ్యారు కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news