ఈనెల 15న కామారెడ్డిలో BC డిక్లరేషన్ విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రజలలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ సభకు ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలకు ఆహ్వానం పంపాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రేపు హైదరాబాద్ లో జరిగే PCC విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చలు జరపనున్నారు.

ఇదిలా ఉండగా… కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. అతను ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో షబ్బీర్ అలీ కారులో లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షబ్బీర్ అలీ కారు డ్రైవర్ డివైడర్ ని ఢీ కొట్టాడు. ఆ సమయంలో కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. షబ్బీర్ అలీ కారు డ్రైవర్ కూడా క్షేమంగా బయటపడినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.