Congress MLA Apologises : సోమవారం రోజున బక్రీద్ పండుగ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పండుగను ముస్లింలు చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. బక్రీద్ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం… గొర్రెలను బలిస్తారు. గొర్రెలతో పండుగ చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు. అయితే ఇలాంటి నేపథ్యంలో బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ… కాంగ్రెస్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి దంపతులు అలాగే… భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు.
బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ గొర్రె ఉన్న పోస్టు పెట్టబోయి… గోవు పోస్టులు పెట్టారు. దీంతో వీరిపై బిజెపి సీరియస్ అయింది. అనంతరం… చేరుకున్న కాంగ్రెస్ నేతలు సారీ చెప్పారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఓ వీడియో విడుదల చేసి మరి క్షమాపణలు చెప్పడం జరిగింది. బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టిన పోస్టర్లో జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.