బోండా ఉమ కక్ష సాధింపులకు నిరసనగా వైసీపీ దళిత నేత శిరోముండనం ?

-

 

బోండా ఉమ కక్ష సాధింపులకు నిరసనగా వైసీపీ దళిత నేత శిరోముండనం చేసుకున్నాడ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపి దళిత నాయకుడిపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గుండా గిరికి దిగినట్లు వైసీపీ ఫైర్‌ అవుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశాడనే కోపంతో అధికారులనుపయోగించి జగదీష్ కు చెందిన భవనాన్ని జేసీబీతో కూల్చివేయించారు బోండా. ఈ ఘటనపై మనస్థాపానికి గురై కూల్చేసిన భవనం ముందు శిరోముండనం చేయించుకుని అర్ధనగ్నంగా నిరసన తెలిపారు జగదీష్.

ఈ సందర్భంగా నందెపు జగదీష్ మాట్లాడుతూ… గతంలో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ భవనం అప్పటి ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారని… తాను ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశానని అసూయతో, అధికార మధంతో భవనాలను కుప్పకూల్చారని పేర్కొన్నారు. దీనిపై సీఎం చంద్రబాబుకు స్పందనలో ఫిర్యాదు చేస్తానని… దళిత వైసీపీ నాయకుడిగా ఉండటం నేను చేసిన తప్పా.? అంటూ నిలదీశారు.

బోండా ఉమాకు అధికారం తోడవడంతో ఇటువంటి అన్యాయాలు ముందు రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని… నేను మాజీ కార్పొరేటర్, కో ఆప్షన్ మెంబర్, నాకు న్యాయం జరగకపోతే, నా కుటుంబ సభ్యులకి శిరోముండనం చేసుకొని నిరసన తీవ్రతరం చేస్తానని వెల్లడించారు. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version