వంద మంది రోగులకు ఒక్కడే డాక్టర్… మరీ దారుణం…!

-

కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో మెజారిటీ పేషంట్లు గుండె, ఊపిరితిత్తుల సమస్యతో చనిపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. జిల్లా హాస్పిటల్స్ లో పాజిటివ్ పేషంట్లను గాంధీకి పంపిస్తున్నారని, అక్కడికి వెళ్తే పది మంది లో 5 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన మండిపడ్డారు. సంగారెడ్డికి చెందిన అబ్దుల్ ఖయూమ్ అనే వ్యక్తి గాంధీలో చేరి తనను ఎవరూ చూడడం లేదని కొడుక్కి ఫోన్ చేసి చెప్పారని పేర్కొన్నారు.

jagga-reddy

చెప్పినట్లుగానే నిన్న వైద్యం అందక అతడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేసారు. నేను సిబ్బందిని తప్పుపట్టడం లేదని… వంద మంది పేషంట్లకు ఒక్క డాక్టర్ ఉంటే వారు ఏమి చేస్తారని ఆయన ఆరోపించారు. వసతులు కూడా లేవని అన్నారు. మరొక పేషంట్ ను కూడా గాంధీకి రెఫర్ చేస్తే..మేము అక్కడికి వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళామని ఆయన అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రస్తుతం ఆ పేషేంట్ కోలుకుంటున్నారని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version