టీఆర్ఎస్ ను ప్ర‌జ‌లు బొంద పెట్ట‌డం ఖాయం : ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాల‌న నియంతల ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు. రాష్ట్రంలో పోలీస్ వ్య‌వ‌స్థ‌ను కేసీఆర్ పూర్తిగా నాశ‌నం చేశాడ‌ని మండిప‌డ్డారు. ఉమ్మ‌డి ఏపీ లో పోలీసు వ్య‌వ‌స్థ‌కు దేశంలోనే మంచి పేరు ఉండేద‌ని అన్నారు. కానీ కేసీఆర్ పాల‌న వ‌చ్చిన నాటి నుంచి పోలీసుల‌ను స్వార్థం కోసం వాడుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు గాంధీ భ‌వ‌న్ లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. కేసీఆర్ ప్ర‌భుత్వం తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడే రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని అన్నారు.

త్వ‌ర‌లోనే టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్ర‌జ‌లు బొంద పెట్ట‌డం ఖాయం అని అన్నారు. అధికారుల‌ను, పోలీసుల‌ను కేసీఆర్ స్వార్థం కోసం వాడుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉన్న వారికే ఉన్నత ప‌దువులు ఇస్తున్నార‌ని ఆరోపించారు. 33 జిల్లాల్లో 20 జిల్లాల‌కు ఐపీఎస్ ల‌కు పోస్టింగ్ లు ఇవ్వ‌డం లేద‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో స‌మ‌ర్థ‌వంతంగా, నిజాయితీ గా ప‌ని చేసే పోలీసు అధికారుల‌కు కేసీఆర్ పోస్టింగ్ లు ఇవ్వ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీఆర్ఎస్ నాయకుల‌, పోలీసు అధికారుల వేధింపుల వ‌ల్ల రామ‌యంపేట్ లో ఓ కుటుంబం మొత్తం బ‌లైపోయింద‌ని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version