తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ జీవోను సోమవారం ఉదయం అంబేడ్కర్ జయంతి సందర్భంగా విడుదల చేసింది. అయితే, జీవో తొలి కాపీనీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కలిసి సీఎం రేవంత్ రెడ్డికి సచివాలయంలో అందజేశారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. విద్య,ఉద్యోగా వకాశాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీలూ మాట్లాడాయని కానీ, ఏ పార్టీ ఆ దిశగా పనిచేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎస్సీ వర్గీకరణను సాధించి చూపించిందన్నారు. 2026లో జరిగే జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు ఎంత పెరిగితే రిజర్వేషన్లు కూడా అంత పెంచుతామన్నారు.సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి వెల్లడించారు.