కేటీఆర్ ను రౌండప్ చేసిన కాంగ్రెస్.. ఆయనపై నమోదైన సెన్సెషన్ కేసులెన్నంటే..?

-

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ చక్రం తిప్పారు.. తన వాగ్దాటితో ప్రత్యర్దులను ఆయన ఇరుకున పెట్టేవారు.. కాంగ్రెస్, బిజేపీలపై నిత్యం విమర్శలు సంధించే కేటీఆర్ కు బ్యాడ్ టైమ్ స్టాటైందన్న ప్రచారం జరుగుతోంది.. ఆయన్ని ముప్పుతిప్పులు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్న టాక్ ఇటీవల కాలంలో జోరుగా వినిపిస్తోంది.. అందుకోసం హస్తం పార్టీ అస్త్రశస్త్రాలు సిద్దం చేస్తోందట.

తెలంగాణాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు గమనిస్తే.. టార్గెట్ కేటీఆర్ అన్నట్లుగా పాలిటిక్స్ సాగుతున్నాయి.. ఇప్పటి వరకు ఆయనపై ఐదుకేసులు నమెదయ్యాయి.. అవి కూడా చిన్నా చితకా కేసులు కాదు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దగ్గర నుంచి లగచర్ల రగడ దాకా కేటీఆర్ నే ప్రధాన నిందితుడిగా చూపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది.. కేసు ఎక్కడ నమోదైనా.. చివరికి కేటీఆర్ దగ్గరకు వచ్చి ఆగేలా స్కెచ్ లు వేస్తోంది..

మేడిగడ్డ పై డ్రోన్ ఎగరేసిన కేసుతోపాటు.. ఫోన్ ట్యాపింగ్, ఫామ్ హౌస్ డ్రగ్స్, ఈ-రేస్, లగచర్ల రగడ వంటి ఘటనల్లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.. రేపో మాపో కేటీఆర్ అరెస్టు ఖాయమంటూ ప్రభుత్వం లీకులు ఇస్తూ ఉండటంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.. అరెస్టులకు భయపడే ప్రసక్తేలేదని కేటీఆర్ చెబుతున్నా.. కాంగ్రెస్ మాత్రం దూకుడుగానే వ్యవహరిస్తోంది.. ప్రతి కేసులోనూ.. మెయిన్ టార్గెట్ గా కేటీఆర్ ఉంటున్నారు.. కేటీఆర్ ను ముప్పుతిప్పులు పెట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్న అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

స్తానికులను రెచ్చగొట్టి కలెక్టర్ మీదకు దాడి చేయించారన్న అభియోగాల నేపథ్యంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ రెడ్డిని అరెస్టు చేశారు.. ఆయన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు కనిపించడం సెన్సెషన్ గా మారింది.. అలాగే ఆగస్టులో తెలంగాణను ఊపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి..ఈ కేసులో నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ అనే టాకో్ వినిపిస్తోంది.

ఫార్ములా ఈ -కారు రేసింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఏసీబీ.. కేటీఆర్ ను ప్రశ్నించేందుకు గవర్నర్ కు లేఖరాసింది.. క్యాబినెట్ ఆమోదం లేకుండా.. కార్ రేసింగ్ కోసం ఖజానా నుంచి 55కోట్లు చెల్లించారనేది కేటీఆర్ మీద అభియోగం.. గవర్నర్ నుంచి అనుమతి కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.. కేటీఆర్ బామ్మర్దిఫామ్ హౌస్ లో కేటీఆర్ ను కాంగ్రెస్ పార్టీ కార్నర్ చేస్తోంది.. ఈ ఐదు కేసుల్లో ఏదో ఒకదాంట్లో అయన్ని అరెస్టు చేస్తారనే టాక్ వినిపిస్తోంది.. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను కేటీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version