ఏపీలో మహిళల భద్రత ఎంతటి ప్రమాదకరస్థితిలో ఉందో హోంమంత్రి ప్రకటన ద్వారా తేలింది అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 7234 కేసులు నమోదయ్యాయి. మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక హోంమంత్రి ఎదురుదాడి చేస్తున్నారు. దమ్ము.. ధైర్యం అంటూ సభ్యత మరిచి మాట్లాడుతున్నారు. ముచ్చుమర్రిలో నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారు. రాంబిల్లి ఘటనలో బాధితురాలికి ప్రభుత్వం ఏవిధంగానూ సాయం చేయలేదు. నగరిలో మూడున్నరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. హిందూపురంలో అత్తాకోడళ్ల పై అత్యాచారం చేశారు . నమ్మకం ఉంది కాబట్టే కోటి 50 లక్షల మంది దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు . కానీ ఆ దిశ యాప్ ను నిర్వీర్యం చేసేశారు అని ఆమె పేర్కొన్నారు.
అలాగే గుంటూరు రమ్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేశాం. రమ్య కుటుంబానికి జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు. రమ్య సోదరికి ఉద్యోగావకాశం కల్పించారు. తణుకు, తునిలో సంతల్లో బెల్టుషాపులు ఎలా వచ్చాయి. బెల్టు షాపులు పిల్లలతో నడిపిస్తున్నారు. సింగరాయకొండలో మద్యం మత్తులో లేడీ కండక్టర్ పై దాడి జరిగింది. ఎమ్మెల్యే ఆదిమూలం పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వేధింపులతో వీఆర్వో ఆత్మహత్యాయత్నం చేశారు. సొంత పార్టీ సర్పంచ్ భార్యకే రక్షణలేని పరిస్థితి ఉంది అని వరుదు కళ్యాణి తెలిపారు.