కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ నమ్మకం,గ్యారెంటీ :మంత్రి సీతక్క

-

ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో అన్నింటిపైనా పన్నులు వేసి దేశ ప్రజల నడ్డి విరుస్తున్నారని మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవాళ హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ నమ్మకం, గ్యారెంటీ అని అన్నారు.రాష్ట్రంలో ప్రజలను ఆత్మగౌరవంతో బ్రతికేలా చేసింది కాంగ్రస్ మాత్రమేనని చెప్పారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఎన్నో గోసలు పడ్డామని మండిపడ్డారు.

ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పని చేసినందుకే ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపిచారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిందేమి లేకపోవడంతోనే కాంగ్రెస్‌పై తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తప్పుడు విమర్శలు చేయడం తగునా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే కాంగ్రెస్‌ పార్టీ ఆహార భద్రత, ఉపాధిహామీ, విద్యాహక్కు వంటి చట్టాలను తీసుకొచ్చిందని , జీఎస్‌టీ పేరిట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను లూఠా చేస్తుందని మంత్రి సీతక్క ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version