కాంగ్రెస్‌కు కొత్త ఊపు…నల్గొండలో లీడ్?

-

రేవంత్ రెడ్డి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చిందనే సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన దూకుడుగా వెళ్ళడం కాంగ్రెస్‌కు బెనిఫిట్ అవుతుంది. కాకపోతే సొంత పార్టీలో ఉన్న లుకలుకలు, బీజేపీ కూడా పోటీగా పుంజుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య పెద్దగా హైలైట్ కావడం లేదు. కానీ ఇప్పుడుప్పుడే కాంగ్రెస్ పార్టీలో మార్పులు కనిపిస్తున్నాయి. పార్టీలో ఎన్ని విభేదాలు ఉన్నా సరే…ఆ విభేదాలని పక్కనబెట్టి ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ నేతలు ఐకమత్యంతో ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డిలు ఒకే వేదిక మీద కలవడమే దీనికి ఉదాహరణ. ఇలా పార్టీ నేతలు కలిసి కష్టపడితే.. మంచి ఫలితాలు సాధించవచ్చు. అదే సమయంలో పార్టీకి బలమైన క్యాడర్ కూడా ఉంది…బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. కాబట్టి ఇంకాస్త కష్టపడితే కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఉంటుంది. అలాగే తమకు పట్టున్న జిల్లాలపై ఫోకస్ చేస్తే ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఆ విషయం కాంగ్రెస్ నేతలు గ్రహించి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.

ఉదాహరణకు చూసుకుంటే నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట. మొదట నుంచి జిల్లాలో కాంగ్రెస్ మంచి విజయాలు సాధించింది. కానీ గత ఎన్నికల్లోనే దారుణంగా ఓడింది. అలా అని ఇక్కడ పార్టీ వీక్ కాలేదు.

ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్‌పై వ్యతిరేకత వస్తుంది…పైగా ఇక్కడ బీజేపీకి బలం లేదు. ఈ పరిస్తితులని గమనిస్తే..నల్గొండలో కాంగ్రెస్‌దే పైచేయి అవుతుంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో కోదాడ, నల్గొండ, సూర్యాపేట, హుజూర్‌నగర్, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్, నాగార్జున సాగర్, ఆలేరు లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మంచి లీడ్ ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లోపు ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మరింత కష్టపడి పట్టు సాధిస్తే…ఇంకా నల్గొండలో కారు అడ్రెస్ ఉండదు. మరి నల్గొండపై కాంగ్రెస్ పట్టు సాధిస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version