కాంగ్రెస్ ది పీపుల్స్ మేనిఫెస్టో అని.. ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుంది భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇవాళ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన అంశాలు అన్నింటినీ ఈ మేనిఫెస్టోలో పొందుపరిచామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుంది అని తెలిపారు.
దళితులు, గిరిజనుల ప్రయోజనాల కోసమే మేనిఫెస్టో ఉందని తెలిపారు. రాష్ట్ర ఆస్థులను ప్రజల మధ్య పంచాలని చూస్తున్నారు. పేదలకు హక్కులను కల్పించేందుకు పలు అంశాల గురించి ప్రస్తావించారు.కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రతీ ఇంటికి తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను గాంధీ భవన్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే అభయహస్తం పేరుతో రూపొందించిన మేనిఫెస్థో విడుదల చేశారు. 42 పేజీల్లో 62 ప్రధాన అంశాలతో కాంగ్రెస్ సాధారణ మేనిఫెస్టో సిధ్ధం చేసింది. ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ ప్రకటనతో పాటు జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.