కాంగ్రెస్ నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాలనుకుంటోంది : పాడి కౌశిక్ రెడ్డి

-

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. తన ఫోన్ ట్యాప్ చేసి మరీ కుట్రలు పన్నుతున్నారంటూ మండిపడ్డారు. కేటీఆర్ బావమరిది రాజ్‌‌పాకాల ఫాంహౌస్‌లో నిర్వహించిన పార్టీ వ్యవహారంలో కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి.

రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం తెలంగాణ భవన్‌లో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. తనని కూడా ఇలాగే డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు యత్నించారని ఆరోపించారు. తన ఫ్రెండ్ సర్‌ప్రైజ్ బర్త్‌డే పార్టీకి వెళ్తుంటే తన ఫోన్‌ను ట్యాప్ చేసిన పోలీసులు.. దాదాపు 100 సిబ్బందితో పాటు ఇద్దరు ఏసీపీలు, ఐదుగురు సీఐలు పార్టీ జరిగే ప్రదేశానికి వచ్చి తనని, అక్కడున్న వారందరిపై సోదాలు జరిపారని చెప్పారు. తమ వద్ద ఏమీ దొరకలేదని వెళ్లిపోయారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version