గిరిజన బాలిక సాయిశ్రద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం

-

Chief Minister Revanth Reddy : గిరిజన బాలిక సాయిశ్రద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం చేశారు. మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఇచ్చిన మాట ప్రకారం పేద విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జెండాగూడ చెందిన గిరిజన విద్యార్థిని సాయి శ్రద్ధ MBBS లో సీటు సాధించింది. అయితే కాలేజీ ఫీజు కట్టేందుకు సాయి శ్రద్ధ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

Chief Minister Revanth Reddy provided financial assistance to the tribal girl Saishraddha

ఇదే విషయం సీఎం రేవంత్ దృష్టికి రావడంతో డాక్టర్ కావాలన్న తన కోరిక నెరవేర్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హమీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు విద్యార్థిని సాయి శ్రద్ధకు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భం గా సాయి శ్రద్ధ..సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version