పాలమూరులో 14కు 14 సీట్లు గెలుస్తాం: రేవంత్

-

గద్వాల జిల్లా కాంగ్రెస్కు కంచుకోట అని.. కొందరు పోయినంత మాత్రాన పార్టీ బలహీనపడదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గద్వాలకు చెందిన పలువురు సర్పంచ్, ఎంపీటీసీలు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ‘పాలమూరు బిడ్డకు సోనియా పీసీసీ పదవి ఇచ్చారు. పాలమూరులో 14కు 14 సీట్లు గెలుస్తాం. కేసీఆర్కు తన పాలనపై నమ్మకముంటే గజ్వేల్లోనే పోటీ చేయాలి. సిట్టింగ్లు అందరికీ సీట్లు ఇవ్వాలి’ అని తెలిపారు.

ఇది ఇలా ఉంటె, కాంగ్రెస్‌కు రైతులంటే చులకన అని, వారిని ముంచే కుట్ర చేస్తే సహించేది లేదు.. ఖబడ్దార్‌ రేవంత్‌రెడ్డి అని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మండలంలోని శేరివెంకటాపూర్‌ రైతువేదికలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనలో చాలీచాలని కరెంటుతోపాటు ఎరువుల కోసం పోలీస్‌స్టేషన్‌లో లైన్లో నిలబడి లాఠీ దెబ్బలు తిన్న విషయాన్ని గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి లేదని, 24 గంటల నాణ్యమైన కరెంటుతోపాటు సాగుకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించారన్నారు. కాంగ్రెసోళ్లు 3 గంటల విద్యుత్‌ అందిస్తామంటుంటే.. బీజేపోళ్లు మోటర్లకు మీటర్లు పెడతామంటున్నారని మండిపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version