బీజేపీలో చేరికలపై కిషన్ రెడ్డి ఫోకస్

-

తెలంగాణ రాజకీయాల్లో అతిత్వరలో చాలా కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. భారతీయ జనతా పార్టీలోకి భారీగా చేరికలు ఉండబోతున్నాయి. తెలంగాణలో రాజకీయ వలసలపై టీవీ9 బ్లాస్టింగ్ న్యూస్‌.. త్వరలో బీజేపీ లోకి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు రానున్నాయి. శ్రావణమాసంలో చేరికలకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం. నిన్న మొన్నటి వరకు పార్టీలో కొత్తగా చేరిన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి వంటి నాయకులు రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. కొత్తగా వచ్చిన నాయకులన సంతృప్తి పరచడానికే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి.

బీజేపీలోకి చేరికలపై ఆ పార్టీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టి సారించారు. ఇప్పటికే పలువురు నేతలు కిషన్ రెడ్డితో భేటీ కాగా.. తాజాగా ఆకుల రాజేందర్, మాగం గంగారెడ్డి సహా పలువురు నేతలతో ఆయన చర్చలు జరిపారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై కిషన్ రెడ్డి ఫోకస్ పెట్టారని, ఆగస్టు నుంచి పార్టీలోకి చేరికలు ఉంటాయని నేతలు చెబుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version