భువనగిరి గడ్డపై మూడోసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మునుగుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. వేముల వీరేశం, కిరణ్ కుమార్ రెడ్డితో పాటుగా ప్రచారాన్ని నిర్వహించారు. గత పదవులలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మండిపడ్డారు కేసీఆర్ కుటుంబం చేసిన పాపాలకి జైలు జీవితం తప్పదు అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణని బంగారు తెలంగాణ గా మార్చుకోవచ్చు అని చెప్పారు కొంతమంది గుంట నక్కలు మోసం చేశారని వాళ్ళకి తగిన బుద్ధి చెప్పిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు అని అన్నారు. రామన్నపేట రైల్వే స్టేషన్లో ప్రతి ఒక్క రైలు ఆగే విధంగా పోరాడుతున్నానని అన్నారు 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.