రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ ని గెలిపించారు : సీఎం రేవంత్ రెడ్డి

-

రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ ని గెలిపించారు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మణుగూరులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. 60 సంవత్సరాల ఆకాంక్ష.. వందలాది మంది విద్యార్థుల ఆత్మబలిదానం.. పాల్వంచలో ఒక ఉద్యోగం కోసం తెలంగాణ ఉద్యమం మొదలైందని గుర్తు చేశారు. మాటిస్తే.. సోనియా వెనక్కి వెళ్లరు. ఈ సభతో బీఆర్ఎస్ కి ధడ పుట్టిందన్నారు.

తాను 2007లో ఖమ్మం జిల్లాకు వచ్చానని.. ఖమ్మం గొప్ప చరిత్ర కలిగిన జిల్లా. 18 సంవత్సరాల్లో ఏ రోజు ఎప్పుడూ వచ్చినా ఖమ్మం జిల్లా యువకులు, మా మిత్రులు వేలాది మంది అండగా నిలబడి గుండెల్లో పెట్టి చూసుకుంటున్నందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు.. మొన్న జరిగిన 10 అసెంబ్లీ స్థానాలకు 09 అసెంబ్లీ స్థానాలు గెలిపించినందుకు ధన్యవాదాలు. భద్రాచలంలో శ్రీరాముడి ఆశీస్సులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించినట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కి అండగా ఉన్న ఖమ్మం వాసుల గురించి అందరికీ తెలుసు అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version