జానీమాస్టర్ వివాదంలో కుట్ర కోణం : ప్రొడ్యూసర్ సి కళ్యాణ్

-

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ వివాదంపై టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ తాజాగా స్పందించారు.శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..జానీమాస్టర్ కేసులో పెద్ద కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలు తనకు అన్యాయం జరిగిందని భావిస్తే ముందుగా ఇండస్ట్రీలో ఫిర్యాదు చేయాలి. ఇక్కడ న్యాయం జరగకపోతే పోలీసులను ఆశ్రయించాలి. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. అసలు నేరం జరిగిందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. నాలుగేళ్ల కింద లైంగికదాడి చేస్తే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారనేది అసలు ప్రశ్న. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడు అఘాయిత్యం చేస్తే దానిని ఇప్పుడు ఎలా నిరూపిస్తారు.

అలాంటప్పుడు పోక్సో కేసు ఎలా వర్తిస్తుందో తెలియడం లేదన్నారు. జానీమాస్టర్‌కు ప్రస్తుతం ఒక గుర్తింపు, జాతీయ స్థాయిలో అవార్డు వచ్చాకే ఆమెకు అన్యాయం జరిగిందని గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. నిజంగా ఆమెకు అన్యాయం జరిగితే జానీకి శిక్ష పడాల్సిందే. అందులో అనుమానం లేదు. ఇలాంటివి తాము ఎంకరేజ్ చేయబోం అని అన్నారు. కానీ, సదరు యువతికి మాస్టర్ కార్డు రానివ్వకుండా జానీ మాస్టర్ అడ్డుకున్నారనేది అబద్ధం.స్వయంగా ఆయనే దగ్గరుండి ఇప్పించాడనేది నిజమని అని సి కళ్యాణ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version