గొర్రెల కాపలకు వెళ్లిన కానిస్టేబుల్‌కు కత్తిపోట్లు పడ్డాయి.అనంతరం కొందరు దుండగులు సుమారు 70 గొర్రెలను దొంగిలించారు. ఈ ఘటన హైదరాబాద్ – హయత్ నగర్ కొహెడలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నట్లు సమాచారం.
కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నవీన్ అనే కానిస్టేబుల్.. తన తండ్రి అనారోగ్యం పాలవ్వడంతో ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో గొర్రెలకు కాపల కోసం మరో వ్యక్తితో కలిసి వెళ్లారు.ఈ క్రమంలోనే గొర్లను దొంగిలించడానికి వచ్చిన కొందరు దుండగులు కావలి ఉన్న ఇద్దరిపై కత్తులతో దాడి చేసి 70 గొర్లను ఎత్తుకెళ్లారు.ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గొర్లకి కావలికి వెళ్లిన కానిస్టేబుల్ పై కత్తులతో దాడి చేసి 70 గొర్లను ఎత్తుకెళ్లిన దుండగులు
హైదరాబాద్ – హయత్ నగర్ కొహెడలో గొర్లకి కావలి ఉన్న ఇద్దరిపై కత్తులతో దాడి చేసి 70 గొర్లను ఎత్తుకెళ్లిన దుండగులు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నవీన్ అనే కానిస్టేబుల్‌కు… pic.twitter.com/qk5hgVgLHf
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2025