జగిత్యాల జిల్లాలో గంజాయి మత్తులో యువత చిత్తవుతున్నారు.ఫుల్లుగా గంజాయి సేవిస్తూ రాత్రిళ్లు నషాలో తేలుతున్నారు. అర్ధరాత్రి రోడ్లపై సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. దీంతో బయటకు వెళ్లాలంటేనే కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ క్రమంలోనే జగిత్యాల పట్టణం కృష్ణ నగర్ వీధిలో రాత్రి గంజాయి తాగుతున్నారని ఇద్దరు అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు.వారికి గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతుందని పోలీసులు ఆరాతీశారు. తనిఖీలు నిర్వహించారు. ఈ వీధిలో ఉండలేకపోతున్నామని.. గంజాయి నుంచి యువతకు విముక్తి కలిగించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్రంలో గంజాయి వాడకం పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.