భారత ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. రక్షణ శాఖ అధికారులు సైతం కేంద్రమంత్రి వెంట ఉన్నారు. పెహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకున్న చర్యలపై ప్రధాని మోడీకి రక్షణ మంత్రి వివరించనున్నట్లు సమాచారం. ఎల్ఓసీ వద్ద ప్రస్తుత పరిస్థితులను వివరించి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రధాని మోడీ.. త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, రక్షణ మంత్రితో కలిసి చర్చించనున్నారు.
అలాగే జమ్మూ కాశ్మీర్‌లోని భద్రతా పరిస్థితిని సమీక్షించనున్నారు.ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ఈ దాడికి బాధ్యత వహించిన నేపథ్యంలో పాకిస్తాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తుండటంతో భారత సైన్యం సంసిద్ధత, ప్రతిస్పందన వ్యూహాలపై చర్చించనున్నారు.కౌంటర్-టెర్రరిజం చర్యలు, సరిహద్దుల భద్రతపైనా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.