గుడ్ న్యూస్ : కొద్దిసేపటి క్రితం కదిలిన రాకాసి నౌక..

-

ఈజిప్టులోని సూయిజ్‌ కాలువలో అడ్డంగా ఇరుక్కున్న భారీ కంటైనర్‌ నౌక ‘ఎవర్‌ గివెన్‌’ ఎట్టకేలకు కదిలింది. ఈ నౌక ముందు భాగంలో ఇసుక అంతటినీ అధికారులు నిరంతరం తొలగిస్తూ ఉండడంతో ఈ నౌక ఉదయానికి నీటిలో తేలింది. అయితే అది అడ్డంగా ఉండడంతో నిలువుగా తిప్పేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు అది సఫలం కావడంతో రాకాసి నౌక ప్రయాణం మొదలైంది.

దీంతో ఇప్పటికే భారీగా జామ్‌ అయిన 450 ఇతర నౌకలకు మార్గం సుగమమైనట్లు సూయిజ్‌ కాలువ నిర్వహణ సంస్థ వెల్లడించింది. దాదాపు 18వేల కంటైనర్లతో వెళ్తున్న ఈ ఎవర్‌ గివెన్‌ నౌక మంగళవారం నాడు వీచిన గాలులకు సూయిజ్‌ కాలువలో అడ్డంగాతిరిగి చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ భారీ నౌక సూయిజ్‌ కాలువలో చిక్కుకుపోవడంతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపించడం గమనార్హం.  

Read more RELATED
Recommended to you

Exit mobile version