వివాదాస్పద రీతిలో అవుట్..అంపైర్లపై కోహ్లి ఆగ్రహం

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ కోహ్లి ఆగ్రహానికి గురయ్యారు.మ్యాచ్లో నో బాల్ను ఔట్ ఇచ్చినట్లు భావించిన అతడు అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్షిత్ బౌలింగ్లో తొలి బంతిని ఎదుర్కొన్న కింగ్ కోహ్లి అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చారు. నో బాల్ అంటూ రివ్యూ తీసుకున్నప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్గానే ప్రకటించారు. దీంతో ఆవేశానికి గురైన కోహ్లి అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసహనంతో పెవిలియన్కు వెళ్లారు. డగౌట్ వద్ద బ్యాట్ను నేలకేసి కొట్టారు.

ఇదిలా ఉంటే… తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 222 పరుగుల భారీ స్కోరు చేసింది. కేకేఆర్కు ఓపెనర్ సాల్ట్ శుభారంభాన్ని ఇచ్చారు. 14 బంతుల్లోనే 48 రన్స్తో విధ్వంసం సృష్టించారు. పవర్ ప్లే తర్వాత చకచకా వికెట్లు పడటంతో కెప్టెన్ అయ్యర్ 50 పరుగులతో జట్టును ముందుండి నడిపించారు. చివర్లో రమణ్ దీప్ 9 బంతుల్లో 24* రన్స్తో రాణించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో గ్రీన్, యశ్ చెరో రెండు వికెట్లు తీశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news