గత కొంత కాలంగా.. వంటనూనెల ధరలు.. ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. 90 రూపాయలు ఉండేటువంటి వంటనూనెల ధరలు డబుల్ అయి… 180 రూపాయల కు చేరాయి. దీంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా.. సామాన్యులకు శుభవార్త చెప్పాయి ఈ ఆయిల్ కంపెనీలు. దేశంలో వంటనూనెల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నెల రోజుల్లో కేజీ నూనె ధర రూ.8 నుంచి… రూ.10 మేర తగ్గింది.
ఇదే నేపథ్యంలో మరో నాలుగు రూపాయలు తగ్గే అవకాశం ఉందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. మన దేశంలో ఈ ఏడాది 120 లక్షల టన్నుల సోయాబీన్ ఉత్పత్తి, రెండు లక్షల టన్నుల మేర అదనంగా వేసిన వేరుశనగ పంటల కారణంగా త్వరలోనే వంటనూనెల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే 150కి దిగువగా వంటనూనెల ధరలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయిల్ కంపెనీ కూడా చెబుతుంది. నిజంగా ఇదే జరిగితే సామాన్యులకు భారీగా ఊరట లభించే ఛాన్స్ ఉంది.