కూలీ, వార్-2 సినిమా కలెక్షన్లు ఎంతో తెలుసా…!

-

రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా విడుదలైన మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన 9 రోజుల్లోనే ఏకంగా రూ. 450 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు.

War 2, Coolie movie, war 2 tickets
War 2, Coolie movie, war 2 tickets

కూలీ సినిమా కేవలం 9 రోజుల్లోనే 74% రికవరీ చేసిందని మరో 80 కోట్లు మాత్రమే వసూలు చేయాల్సి ఉందని చెబుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2 సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ. 314 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్నట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, వార్-2 సినిమా విడుదలైన మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news