అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తన సినిమాలతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ హీరో కొద్ది రోజుల క్రితం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ అమ్ముకోలేకపోయింది. ఇదిలా ఉండగా… నటుడు అఖిల్ పై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

తనకు కష్టం వచ్చిన సమయంలో తనతో పాటు పనిచేసిన హీరోలు అందరూ ఎంతగానో సపోర్ట్ గా నిలుస్తారని అనిల్ సుంకర అన్నారు. సినిమాలు ఆడకపోతే తన హీరోలు ఎంతో మద్దతుగా తనవైపు ఉంటారని అన్నాడు. భోళా శంకర్ సినిమా విషయంలో చిరంజీవి ఎంతగానో సహాయం చేశారని అనిల్ సుంకర చెప్పారు. అలాగే ఏజెంట్ సినిమాకి హీరో అఖిల్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని అన్నారు. కాగా, ఏజెంట్, భోళా శంకర్ సినిమాలో పెద్దగా విజయం సాధించలేదని రెండు సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయని అన్నారు. అనిల్ సుంకర మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.