ఎన్ని వంటలు ఉన్నప్పటికీ తినేప్పుడు కారంపోడి ఉంటే సైడ్ డిష్ గా బాగా తినేయోచ్చు. అయితే కారంపొడి అంటే ఎప్పూడూ మీరు చేసుకునే పల్లీల పొడి కాకుండా.. కాకరకాయతో కూడా ఈరోజు ట్రై చేద్దాం. కాకరకాయ అంటే వామ్మో చేదు అని చాలామంది దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ కాకరకాయలో ఉండే పోషకాలు మరే కూరగాయలో కూడా అంత ఉండవు. చిన్నప్పుడు అంటే చేదు అని పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ద పెరిగింది కదా.. అసలే మన జీవనశైలి అంతంమాత్రం.. బిజీలైప్ లో పానిపూరీలు, బర్గర్లే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసేవి డైలీ కాకపపోయినా అప్పుడుప్పుడు తినాలి.. వీటిని తినడం అలవాటు చేసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు.. డయబెబీస్ కు కాకరకాయ ఇంకా మంచిది..
నాచురల్ విధానంలో కాకరకాయతో కారంపొడి ఎలా చేయాలంచే..
కావలసిన పదార్థాలు
కాకరకాయ 250 గ్రాములు
పల్లీలు 50 గ్రాములు
మామిడికాయ పొడి – 1 స్పూన్
మినపప్పు – 1 స్పూన్
జీలకర్ర – 1 tsp
ధనియాలు – 1 స్పూన్
ఎండు మిర్చి – 8
పచ్చిశనగపప్పు 1 స్పూన్
తయారుచేసే విధానం..
కాకరకాయలు తీసుకుని తురమండి. ఆ తురుము నుంచి నీటిని పిండండి. రసం దిగిపోతుంది. అప్పుడు అంత చేదుగా కూడా ఉండదు. అలా పిండిన కాకరకాయ తురుము పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకుని దోరగా వేపించాలి. అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకుని అదే పాన్ లో.. పల్లీలు వేసుకుని దోరగా వేపించి తీసేయండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేయించాలి. ఎండుమిరపకాయలు వేయించాక..తీసేసి..పాన్ లో తురిమి రసం పిండిన కాకరకాయను వేయాలి. 15-20 నిమిషాలు పాటు.. తిప్పుకుంటూ స్లో ఫేమ్ లో వేపాలి. ఇలా చేసేసరికి.. అందులో తడిపోయి..పొడికి అనుకూలంగా తయారవుతుంది.
ఆ తర్వాత మిక్సీ తీసుకుని ముందుగా వేయించుకున్న మినప్పుపు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత అందులోనే మిరపకాయలు, వేపించిన కాకరకాయ తురము కూడా కొద్దిగా వేయండి. గ్రైండ్ చేశాక.. మిగిలిన తురుము, పల్లీలు వేసి మామిడికాయ పొడి కొద్దిగా వేసి గ్రైండ్ చేయండి. అంతే.. కాకరకాయ కారం పొడి రెడీ. ఉప్పు లేకుండా.. ఆరోగ్యానికి మేలు చేసే పొడిని అన్నంలో తినొచ్చు, పుల్కాలు తినేప్పుడు మధ్యమధ్యలో ఈ పొడిని కూడా నంచుకు తినొచ్చు.
నాచురోపతి ఫాలోవర్స్ వారానికి ఒకసారి అయినా ఈ పొడి చేసుకుని డైలీ తీసుకుంటే మరీ మంచిది. మధుమేహ వ్యాధి గ్రస్తులు డైలీ కాకరకాయ తింటే.. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కానీ డైలీ కాకరకాయ కూర తినమంటే అయ్యే పనికాదు కదా.. అలాంటప్పుడు ఈ పొడి చేసుకుని దీన్ని రైస్ లోనో, పుల్కాలోనే ఎలాగోలా వాడుకుంటే.. డైలీ కాకరకాయ తిన్నట్లు కూడా అవుతుంది.
-Triveni Buskarowthu