ఆంధ్ర సచివాలయంలో కరోనా విజృంభణ… మరో ఎనిమిది మంది కి కరోనా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయ తాండవం చేస్తుంది. ప్రతిరోజు వందల సంఖ్యలో నుంచి వేల సంఖ్యలో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్ట్ లు చేయడంలో రికార్డు స్థాయి చేరుకుంటే, కేసుల విషయంలో కూడా అదే స్థాయిలో చేరుకుంటుంది. రోజుకి 10,000 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ఏపీ సచివాలయం ఉద్యోగస్తులలో కరోనా భయం రెట్టింపవుతుంది. కొత్తగా 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వారితో పాటు ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.

ap-secretariat-1
ap-secretariat-1

గత నెలలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి దగ్గరలో ఉండే భద్రతా సిబ్బంది లో 12 మందికి కరోనా సోకింది.. అది మరవకముందే ఇప్పుడు సచివాలయంలో మహమ్మారి విజృంభించడంతో ఉద్యోగులందరూ భయాందోళనలో ఉన్నారు. ప్రైమరీ కాంటాక్ట్ లో ఇంకా ఎంత మంది ఉద్యోగస్తులు, అధికారులకు మహమ్మారి సోకిందో వైద్యపరీక్షల్లో తెలియనుంది.